సారథి న్యూస్, సూర్యాపేట : సూర్యాపేట ఆర్డీవో ఎస్. మోహన్ రావు బదిలీ అయ్యారు. మూడు సంవత్సరాలుగా సూర్యాపేట ఆర్డీవోగా విధులు నిర్వహిస్తున్న ఆయన అకస్మాత్తుగా బదిలీ కావడం కొంత చర్చానీయాంశమైంది. ఆయన వెయిటింగ్ పోస్టులో ఉన్నప్పటికీ సూర్యాపేట నూతన ఆర్డీవో గా కే.రాజేంద్ర కుమార్ ను నియామిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.