Breaking News

సూపర్ స్టార్ తో స్టైలిష్ విలన్ ఢీ

పొరుగు రాష్ట్రాల స్టార్ హీరోలు టాలీవుడ్ లో విలన్లుగా నటించడం ఎప్పటినుంచో జరుగుతుంది. అప్పట్లో కన్నడ ప్రభాకర్ మెగాస్టార్ సినిమాల్లో విలన్​గా నటించేశారు. ఆ ట్రెంట్స్​ను ఎక్కువగా ఫాలో అయిపోతున్నారు ప్రస్తుత డైరెక్టర్లు. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ‘ఈగ’ సినిమాలో చేసిన విలన్ పాత్రతో కొత్త ట్రెండ్ సృష్టించాడు. దాంతో ఫ్యామస్ డైరెక్టర్లంతా పొరుగు రాష్ట్రాల హీరోలతో తెలుగు సినిమాల్లో విలనిజాన్ని పండించేస్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటారా? రాజమౌళి ‘ఈగ’తో విలన్ గా తెలుగులో పరిచయమైన సుదీప్ ఆ తర్వాత పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. బాహుబలి, సైరా నరసింహారెడ్డి లాంటి భారీ చిత్రాల్లో కీలకపాత్రలు పోషించిన విషయం తెలిసిందే. తాజాగా మహేష్ బాబు కొత్త సినిమాలోనూ సుదీప్ నటించబోతున్నాడని కొత్త సమాచారం.

సూపర్ స్టార్ మహేష్ బాబుతో పరశురామ్ దర్శకత్వంలో మొదలవబోతున్న ‘సర్కారు వారి పాట’ సినిమాకు నటీనటుల సెలక్షన్స్​ మొదలుపెట్టారు. బ్యాంక్ స్కాములు, ఆర్థిక లావాదేవీల చుట్టూ అల్లుకున్న ఈ కథలో విలన్ స్టైలిష్ గా కనిపించాలట. దీంతో సుదీప్ అయితే ఈ పాత్రకి కరెక్ట్​గా సూట్ అవుతాడని అతన్ని సంప్రదించినట్టు సమాచారం. స్క్రిప్ట్ కూడా విని సుదీప్ ఒకే అన్నాడట. ఇంకా షూటింగ్ షురూ కావడమే లేట్ అంటున్నారు టీమ్ సభ్యులు.