బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ఎందరికో బాధను మిగిల్చింది. మరికొందరు బంధుప్రీతి అంటూ ఆయన మరణం వెనక చాలా కారణాలు ఉన్నాయంటూ సోషల్ మీడియా వేదికగా వాదిస్తున్నారు కూడా. సుశాంత్ మరణం ఇండస్ట్రీకి తీరని లోటే అయినా మరణానికి ముందు సుశాంత్ హీరోగా సంజా సంఘీ హీరోయిన్ గా ముఖేష్ చాబ్రా దర్శకత్వంలో ‘దిల్ బేచారా’ చిత్రం రూపుదిద్దుకుంది. ఈ సినిమా నిన్న డిస్నీ హాట్ స్టార్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్‌కు రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. ఇండియా సినిమాల్లో ది బెస్ట్ గా నిలిచింది ఈ చిత్రం. అయితే ఇప్పుడు మరో అరుదైన ఘనత ఈ చిత్రానికి దక్కింది. ఇండియన్ సినిమాల జాబితా అంతా ఐఎంబీడీలో ఉంటుంది. అక్కడ సినిమాలకు రేటింగ్స్ ఓటింగ్స్ ఉంటాయి. ఐఎంబీడీలో అత్యధిక ఓట్లు దక్కించుకున్న చిత్రంగా మరియు అత్యధిక రేటింగ్ దక్కించుకున్న చిత్రంగా ‘దిల్ బేచారా’ నిలిచింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు 21వేలకు పైగా ఓట్లు నమోదవ్వడంతో పాటు 9.8 రేటింగ్ కూడా వచ్చింది. సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే ఇన్ని ఓట్లు మరియు ఇంత రేటింగ్ రావడం రికార్డ్. భారతీయ సినిమాల్లో ఇప్పటి వరకు ఏ సినిమాకు ఈ స్థాయి రేటింగ్ రాలేదంటూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆత్మహత్య చేసుకున్న సుశాంత్ పై సింపతీతో ఈ స్థాయి రేటింగ్ దక్కింది అంటున్నారు కొందరు. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ను సుశాంత్ ఇచ్చాడని.. అతడి మృతికి ఈ మూవీ ఘన నివాళి అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్ మృతిచెందిన నెల రోజుల్లోనే వచ్చిన ఈ సినిమాకు బాగా పబ్లిసిటీ దక్కడమే కాదు బాగా వర్క్అవుట్ అయిందనిపిస్తోంది.
- July 25, 2020
- Archive
- Top News
- సినిమా
- DIKBECHARA
- DISNYHOTSTAR
- SHUSHANTH
- డిస్నీ హాట్ స్టార్
- దిల్ బేచారా
- సుశాంత్
- Comments Off on సుశాంత్ చివరి చిత్రం.. రేటింగ్స్ అదుర్స్