సారథి న్యూస్, దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలోని రెడ్డి సంఘం భవన్ లో గురువారం ఆటో యూనియన్ ఏర్పాటుచేసిన సంఘీభావ సభలో మంత్రి టి.హరీశ్‌రావు మాట్లాడారు. ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చనిపోవడం బాధాకరన్నారు. తెలంగాణ మొత్తం ఇప్పుడు దుబ్బాక వైపు చూస్తోందన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, తాను, కాబోయే ఎమ్మెల్యే సుజాతక్క ప్రజల వైపే ఉంటామన్నారు. మహిళలను కించపరుస్తూ మాట్లాడడం పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డికి తగదన్నారు. భేషరతుగా ఆయన క్షమాపణ చెప్పాలన్నారు. రేపు దుబ్బాకలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి మహిళలకు సమాధానం చెప్పకపోతే కాంగ్రెస్ పార్టీకి మహిళలు, దుబ్బాక ప్రజలు బుద్ధిచెబుతారని హెచ్చరించారు. దుబ్బాక నియోజకవర్గంలో ప్రతి ఇంటికి మంచినీరు అందజేసిన ఘనత సోలిపేట రామలింగారెడ్డి కుటుంబానికే దక్కిందన్నారు.
- October 8, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- మెదక్
- DUBBAKA
- HARISHRAO
- RAMALINGAREDDY
- SIDDIPETA
- SOLIPETA
- దుబ్బాక
- రామలింగారెడ్డి
- సిద్దిపేట
- సీఎం కేసీఆర్
- సోలిపేట
- హరీశ్‌రావు
- Comments Off on సుజాతక్క, మేం ప్రజల వైపే ఉంటాం