అప్పులబాధ భరించలేక ఓ సీరియల్ నటి, గాయని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏపీలోని గుంటూరుకు చెందిన రేఖ నటనపై ఆసక్తితో హైదరాబాద్ కు వచ్చి కొంతకాలం టీవీ సీరియల్స్ నటించింది. తర్వాత అవకాశాలు తగ్గడంతో గుంటూరుకు వెళ్లింది. అక్కడ అహ్మద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. కుమార్తె పుట్టిన తర్వాత మనస్పర్థలు రావడంతో భర్తతో విడిపోయారు. అనంతరం చైతన్య అనే రియల్ఎస్టేట్ వ్యాపారిని వివాహం చేసుకున్నారు. గుంటూర్ విద్యానగర్లో ఉంటున్న రేఖ పెళ్లి వేడుకల్లో పాటలు పాడటం, యాంకరింగ్ వంటివి చేసేవారు. కాగా కొంతకాలంగా ఆమెకు అవకాశాలు రావడం లేదు. మరోవైపు భర్తకు కూడా రియల్ఎస్టేట్లో నష్టాలు వచ్చాయి. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన రేఖ గురువారం ఉదయం బాత్రూమ్లో ఉరివేసుకొని ప్రాణం తీసుకున్నారు. కాగా ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.