లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర్‌ప్రదేశ్ లోని హత్రాస్‌లో దళిత యువతి హత్యపై ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ శనివారం ఆదేశాలు జారీచేశారు. ఇప్పటికే ఈ ఘటనపై యూపీ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. సిట్ నివేదిక మేరకు సీఎం యోగి ఆదిత్యానాథ్ సంబంధిత జిల్లా ఎస్పీ, డీఎస్పీ, ఇద్దరు సీఐలు, ఎస్సై, హెడ్‌కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. వారికి నార్కో ఎనాలిసిస్, పాలిగ్రాఫ్ పరీక్షలు చేయాలని ఆదేశించారు. ఎస్పీగా ఐపీఎస్ ఆఫీసర్ వినీత్ జైశ్వాల్‌కు బాధ్యతలు అప్పగించారు.
- October 3, 2020
- Archive
- Top News
- జాతీయం
- HATHRAS RAPE CASE
- SIT
- UTTERPRADESH
- YOGI ADITYATHANATH
- ఉత్తరప్రదేశ్
- యోగి ఆదిత్యానాథ్
- సిట్
- సీబీఐ
- హత్రాస్
- Comments Off on సీబీఐ చేతికి ‘హత్రాస్’ కేసు