యాక్షన్ హీరో గోపీచంద్, మిల్కీబ్యూటీ తమన్నా భాటియా జంటగా నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘సీటీమార్’. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతోంది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై చిట్టూరి శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్నా ఈ చిత్రంలో కబడ్డీ కోచ్ జ్వాలారెడ్డిగా కనిపించబోతోంది. సోమవారం తమన్నా పుట్టినరోజు సందర్భంగా కొత్త పోస్టర్ ను విడుదల చేస్తూ చిత్ర యూనిట్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపింది. గోపీచంద్ ఆంధ్రప్రదేశ్ మహిళా కబడ్డీ జట్టుకు కోచ్ గా.. తమన్నా తెలంగాణ మహిళా జట్టుకు కోచ్ గా కనిపించనున్న ఈ చిత్రంతో తమన్నా తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నారు. ‘గౌతమ్ నంద’ తర్వాత గోపీచంద్, సంపత్ నంది కాంబినేషన్లో వస్తున్న ‘సీటీమార్’ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సినిమా విడుదలపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడిప్పుడే థియేటర్స్ రీ ఓపెన్ చేస్తుండడంతో ఈ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.
- December 21, 2020
- Archive
- Top News
- సినిమా
- ‘సీటీమార్’
- CITIMAR
- GOPICHAND
- MILKBEAUTY
- SAMPATHNANDI
- TAMANNA
- TELANGANA
- గోపీచంద్
- తమన్నా
- తెలంగాణ యాస
- సంపత్ నంది
- Comments Off on ‘సీటీమార్’ సెట్లో మిల్క్ బ్యూటీ బర్త్డే