Breaking News

‘సీటీమార్‌’.. ఇక తీన్మార్​

ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్ హీరోగా, మాస్ డైరెక్టర్​ సంప‌త్ నంది ద‌ర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న చిత్రం ‘సీటీమార్‌’. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే.. ఈ ఏడాది మొదలైన ఈ సినిమా లాక్ డౌన్ కు ముందే మూడు షెడ్యూల్స్ లో 60శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ‌మిగతా భాగాన్ని ఆగ‌స్టు మొద‌టి వారం నుంచి షూటింగ్ మొద‌లుపెట్టి ఒకే షెడ్యూల్‌లో సినిమాను కంప్లీట్ చేయ‌డానికి చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఎంత‌గానో ఎదురుచూస్తున్న గోపిచంద్ అభిమానుల‌కోసం వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాత శ్రీనివాసా చిట్టూరి తెలిపారు.

జూన్ 12న ఎగ్రెసివ్ స్టార్ గోపిచంద్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ‘సీటీమార్’ టీమ్ శుభాకాంక్షలు తెలిపి న్యూ స్టిల్ ను రిలీజ్​ చేసింది. ఆంధ్ర క‌బ‌డ్డీ టీమ్ కోచ్ గా గోపిచంద్, తెలంగాణ క‌బ‌డ్డీ టీమ్ కోచ్‌గా త‌మ‌న్నా న‌టిస్తున్నారు. విలేజ్ లో ఉండి హీరోను ప్రేమించే ఒక ప్రత్యేక పాత్రలో మ‌రో హీరోయిన్ దిగంగ‌న న‌టిస్తుండ‌గా చాలా ముఖ్యమైన పాత్రల్లో పోసాని కృష్ణముర‌ళి, రావు ర‌మేష్‌, భూమిక‌, రెహ‌మాన్, బాలీవుడ్​ యాక్టర్​ తరుణ్​ అరోరా నటిస్తున్నారు. మ‌ణిశ‌ర్మ సంగీత సార‌థ్యంలో ఒక పాట మిన‌హా ఇప్పటికే నాలుగు బ్లాక్ బ్లస్టర్​ పాట‌లను రికార్డు చేశారు. మాస్​ ప్రేక్షకుల కోసం ఒక మాస్​ ఐటమ్​ సాంగ్​ను కంపోజ్​ చేస్తున్నారు.