సారథి న్యూస్, హైదరాబాద్: సీఎం కె.చంద్రశేఖర్ రావును మంగళవారం రాష్ట్ర పశుసంవర్ధకశాఖ, సినీ ఫొటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కరోనా వైరస్ నియంత్రణ కోసం రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న చర్యలకు అండగా నిలిచేందుకు వివిధ సంస్థలు సీఎం సహాయనిధికి విరాళాలు అందించాయి. హైదరాబాద్ లోని ఫతేనగర్ స్టీల్ మర్చంట్స్ అసోసియేషన్ రూ.8.51 లక్షలు, శాంత బాగ్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అసోసియేషన్ రూ.1.5వేలు, సికింద్రాబాద్ లోని పుష్ప ట్రెండింగ్ కంపెనీ రూ.లక్ష విరాళంగా ఇచ్చారు. వాటికి సంబంధించిన చెక్కులను మంత్రి అందజేశారు.
- June 16, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- CM KCR
- RELIEF FUND
- సీఎం కేసీఆర్
- సీఎం సహాయనిధి
- Comments Off on సీఎం సహాయనిధికి విరాళాలు