సారథి న్యూస్, చొప్పదండి: కరోనా సంక్షోభంతో ప్రపంచమంతా కొట్టుమిట్టాడుతున్నా.. రైతులకు రైతుబంధు డబ్బులను ఇచ్చిన ధీశాలి కేసీఆర్ అని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కొనియాడారు. ప్రతిరైతును రాజును చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని వరలక్ష్మి పంక్షన్హాల్లో శనివారం రాష్ట్ర ప్రభుత్వం రైతులకోసం నిర్మించనున్న కల్లాల నిర్మాణంపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. కల్లాల నిర్మాణాల కోసం రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయా చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, నాయకులు,అధికారులు పాల్గొన్నారు.
- June 27, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- CHOPPADANDI
- KCR
- MLA
- RYTHUBANDU
- TELANGANA
- కరోనా
- రైతుబంధు
- Comments Off on సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి