సారథి న్యూస్, హైదరాబాద్: ప్రగతి భవన్ వద్ద బుధవారం మధ్యాహ్నం ఓ యువకుడు నిరసనకు దిగాడు. ప్ల కార్డు పట్టుకుని నిరసన వ్యక్తంచేశాడు. పోలీసులు పట్టుకునేందుకు వచ్చే లోపే వెళ్లిపోయాడు. ప్ల కార్డుపై ‘ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ ఆయన మా ముఖ్యమంత్రి ఆయన ఎక్కడున్నారో తెలుసుకోవడం నా హక్కు’ అని ఇంగ్లిష్‌లో రాసుకున్నాడు. పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజేలను పరిశీలించి సదరు నిరసనకారుడు ఎవరనే వివరాలను ఆరాతీస్తున్నారు. కాగా, పలువురు నెటిజన్లు #WhereIsKCR అనే హ్యాష్‌ట్యాగ్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న వేళ కేసీఆర్ ఎక్కడ అనే ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
- July 9, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- CM KCR
- PRAGATHI BHAVAN
- TELANGANA
- కరోనా
- తెలంగాణ
- సీఎం కేసీఆర్
- Comments Off on సీఎం కేసీఆర్ ఎక్కడున్నారు?