అమరావతి: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో డిపోలకే పరిమితమైన సిటీ ఆర్టీసీ బస్సు సర్వీసులు సెప్టెంబర్ 20వ తేదీ నుంచి రోడ్డెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాక్డౌన్ సడలింపు తర్వాత జిల్లాల మధ్య బస్సులు తిరుగుతున్నా నగరాలు, పట్టణాల్లో మాత్రం సిటీ బస్సులు నడపడం లేదు. ఈనెల 7న సిటీ బస్సులను షురూ చేసేందుకు సన్నాహాలు చేసినా చివరి నిమిషంలో వాయిదాపడింది. దీంతో త్వరలో ప్రధాన నగరాల్లో సిటీ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సంస్థ కసరత్తు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన నగరాలు విజయవాడ, విశాఖపట్నంలో సిటీ బస్సులు నడిపించాల్సి ఉంది. ఇదిలాఉండగా, ఈ నెల 20 నుంచి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాల కోసం ఏపీ పంచాయతీరాజ్‌శాఖ పరీక్షలు నిర్వహిస్తోంది. సుమారు 10 లక్షల మంది పరీక్షలు రాయనున్నారు. ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవాలంటే ప్రజారవాణా అయిన ఆర్టీసీ బస్సులే కీలకం. అందులోనూ సిటీ బస్సులు లేకపోతే ఇబ్బందులు తప్పేలాలేవు. దీంతో ప్రభుత్వం సచివాలయ పరీక్షల దృష్ట్యా సిటీ బస్సు సర్వీసులను ప్రారంభించేందుకు రెడీ చేసింది. ఈ మేరకు ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు.
- September 15, 2020
- Archive
- Top News
- ఆంధ్రప్రదేశ్
- AMARAVATHI
- APSRTC
- CITY BUSES
- LOCKDOWN
- PANCHAYATHIRAJ
- అమరావతి
- ఏపీఎస్ఆర్టీసీ
- పంచాయతీరాజ్‌శాఖ
- లాక్డౌన్
- సిటీ బస్సులు
- Comments Off on సిటీ బస్సులు రైట్ రైట్