సారథిన్యూస్, గోదావరిఖని: సింగరేణి సంస్థను ప్రైవేట్‌పరం కాకుండా కాపాడుకుందామని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం పెద్దపల్లి జిల్లాలోని ఆర్జీవన్ ఏరియాలో సీఐటీయూ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. కార్మికహక్కులను కాపాడుకొనేందుకు ప్రతి కార్మికుడు ఉద్యమించాలని కోరారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ.. దేశంలోని బొగ్గుపరిశ్రమలను ప్రైవేట్‌పరం చేసేందుకు కేంద్రప్రభుత్వం కుట్రపన్నుతోందని ఆరోపించారు. కార్యక్రమంలో కార్మికసంఘం నాయకులు మెండె శ్రీనివాస్, నంది నారాయణ, బీ రవి, మెండయ్య, ఓదెలు, సంతోష్, రాజేంద్ర ప్రసాద్, వేణుగోపాల రెడ్డి, శ్రీనివాస్, కృష్ణారెడ్డి, రాయమల్లు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
- August 18, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- EMPLOYEES
- GODAVARIKHANI
- PEDDAPALLY
- SINGHARENI
- కార్మికులు
- గోదావరిఖని
- నిరసన
- సింగరేణి
- Comments Off on సింగరేణిని కాపాడుకుందాం