టాలీవుడ్లో సెలబ్రిటీ బ్యాచిలర్స్ అంతా పెళ్లి బాట పడుతున్నారు. నిన్న హీరో రానా.. నేడు సాహో డైరెక్టర్ సుజీత్ కూడా సైలెంట్ గా తన నిశ్చితార్థం జరుపుకున్నాడు. ‘రన్ రాజా రన్’తో డైరెక్టర్‌గా పరిచయమైన సుజిత్ తన రెండో సినిమానే పాన్ ఇండియా సినిమాగా ‘సాహో’ను తీసి ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ల లిస్ట్‌లో చేరిపోయాడు. అసలు విషయానికొస్తే కొంతకాలంగా ప్రవల్లిక అనే డాక్టర్‌తో ప్రేమలో ఉన్నాడు సుజీత్. ఆ ప్రేమను పెళ్లి పీటల వరకూ తీసుకెళ్లి మూడు ముళ్లు వేసేందుకు రెడీ అయ్యాడు. పెద్దల సమక్షంలో జూన్ 10న నిశ్చితార్థం కూడా జరిగింది. పెళ్లి ఏర్పాట్లు బిజీగా జరుగుతున్నాయట. ప్రస్తుతం ఈ యంగ్ డైరెక్టర్ మెగాస్టార్‌ను ‘లూసిఫర్’ సినిమా రీమేక్స్ సెట్స్ పైకి తీసుకెళ్లే ప్లాన్‌లో ఉన్నాడు.