టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తన అద్భుతమైన ఆట తీరుతోనే కాదు అందంతో కూడా సినిమా స్టార్స్‌కు కూడా ఏ మాత్రం తగ్గని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. ఇన్నాళ్లూ ఆటతో ఆకట్టుకున్న సానియా ఇప్పుడు హీరోయిన్ అవుతోంది. ఇప్పటికే కొందరు స్పోర్ట్స్ స్టార్స్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే అది సినిమాలో కాదు వెబ్ సిరీస్తో. ‘నిషేధ్ ఎలోన్ టుగెదర్’ అనే వెబ్ సిరీస్ లో సానియా నటిస్తోంది. ఎంటీవీ సమర్పణలో రూపొందుతున్న ఈ సిరీస్ మొత్తం ఐదు ఎపిసోడ్ లుగా ప్రసారం కాబోతోంది. దేశంలో టీబీపై అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. ‘కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో టీబీ ఇంకా ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ షో ద్వారా చేపట్టే సమిష్టి కృషి దేశంలో సానుకూలమార్పు తీసుకునేందుకు దోహదపడుతుంది’ అని చెప్పింది సానియా. ఈనెల చివరి వారం నుంచి ఎంటీవీలో ఇది ప్రసారం కానుంది. ఓ మంచి పని కోసం నటిగా తెరపైకి వస్తున్న సానియామీర్జా మున్ముందు నటిగా కొనసాగిస్తుందో లేదో చూడాలి.
- November 18, 2020
- Top News
- సినిమా
- HYDERABAD
- NISHEDALONETOGETHER
- SANIAMIRZA
- TENNISSTAR
- WEBSERIES
- ఎంటీవీ
- టెన్నిస్‌స్టార్
- నిషేధ్ ఎలోన్ టుగెదర్
- సానియామీర్జా
- హైదరాబాద్
- Comments Off on సానియా ఎంట్రీ ఇస్తోంది..