‘అయ్యారే’, ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాలకు దర్శకత్వం వహించిన సాగర్ చంద్ర ఇప్పుడో కొత్త ప్రయోగానికి సాహసం చేస్తున్నాడు. మొదటి చిత్రం ‘అయ్యారే’ కి అంత గుర్తింపు రాకపోయినా 2016లో నారా రోహిత్, శ్రీవిష్ణు హీరోలతో తీసిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమా సాగర్‌కు మంచి గుర్తింపునిచ్చింది. దీంతో అతడు సితారా ఎంటర్టెయిన్మెంట్ వారు నిర్మించనున్న చిత్రానికి దర్శకత్వం వహించే చాన్స్ కొట్టేశాడు. మలయాళంలో బిగ్ హిట్ కొట్టిన ‘అయ్యప్పన్ కోషియమ్’ను సితార సంస్థ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మలయాళంలో బిజూ మీనన్ చేసిన పాత్రను రవితేజ, పృథ్వీరాజ్ పోషించిన పాత్రను రానా చేయనున్నారు. ఈ చిత్రంలో వీరిద్దరికీ పోటా పోటీ సన్నివేశాలున్నాయి. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ లోనూ అలాంటి సీన్లు తెరకెక్కించడంలో సాగర్ మంచి ప్రతిభనే కనబరిచాడు. అందుకే రవితేజ రానా హీరోయిజమ్ తగ్గకుండా సాగర్ ఈ సినిమా తియ్యగలడని భావిస్తున్నారట.
- June 27, 2020
- Archive
- Top News
- సినిమా
- AYYARE
- RANA
- RAVITEJA
- SAGAR
- అయ్యప్పన్ కోషియమ్
- సితారా
- Comments Off on సాగర్ సినిమాలో హీరోలు వాళ్లే