సారథి న్యూస్, నాగార్జునసాగర్: కృష్ణానది పరవళ్లు తొక్కుతుంది. వరద ఉధృతి కొనసాగుతుండడంతో శ్రీశైలం గేట్లను ఎత్తి నాగార్జునసాగర్డ్యాంకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్14 గేట్లను ఎత్తి 3,28,440 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 587.3 అడుగుల మేర ఉంది. 3,28,440 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రిజర్వాయర్లోకి కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటినిల్వ 312.0405 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 305.6838 టీఎంసీలు ఉంది. నాగార్జున సాగర్ నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తుండడంతో పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. ఇక, ప్రాజెక్టు బ్యాక్ వాటర్ సూర్యాపేట జిల్లాలోని మఠంపల్లి మండలం మట్టపల్లి ప్రసిద్ధ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి తాకింది. ఆలయ ప్రహరీ నుంచి లీకేజీ నీళ్లు లోపలికి వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. నాగార్జునసాగర్ నుంచి వరద భారీస్థాయిలో వస్తుండడంతో పులిచింతల ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి ప్రకాశం బ్యారేజీకి నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 3,41,433 క్యూసెక్కులు ఉండగా, 3,18,066 క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
- August 23, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- MATTAMPALLY
- NAGARJUNASAGAR
- PULICHINTHALA
- SRISAILAM
- కృష్ణానది
- నాగార్జునసాగర్
- పులిచింతల
- మఠంపల్లి
- Comments Off on సాగర్ నుంచి కృష్ణమ్మ పరవళ్లు