సారథి న్యూస్, వనపర్తి: మహిళా స్వయం సహాయక సంఘాలు సభ్యుల జీవనోపాదుల సర్వేను రెండు రోజుల్లో కంప్లీట్ చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అధికారులను ఆదేశించారు. గురువారం పలు పథకాలపై సమీక్షించారు. కోవిడ్ రుణాలకు సంబంధించి 5,445 సంఘాలకు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటివరకు 533 సంఘాలకు రూ.3.14 కోట్లు మాత్రమే ఇచ్చామని తెలిపారు. బ్యాంకుల అనుసంధానంతో అమలుచేసే పథకాలను కలెక్టర్ సమీక్షిస్తూ ఈ నెలాఖరు నాటికి రూ.16.8కోట్ల రుణం ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.6.8 కోట్ల లక్ష్యాలను సాధించామన్నారు. సమావేశంలో అడిషనల్ పీడీ అరుణ, డీపీఎం బాష్యానాయక్, అరుణ ఏపీఎంలు హాజరయ్యారు.
- June 12, 2020
- Archive
- మహబూబ్నగర్
- COLLECTOR
- WANAPARTHY
- కలెక్టర్
- కోవిడ్
- వనపర్తి
- Comments Off on సర్వేను కంప్లీట్ చేయండి