Breaking News

‘సబ్​ప్లాన్’​ అమలుపై శ్వేతపత్రం విడుదల చేయండి

‘సబ్​ప్లాన్’​ అమలుపై శ్వేతపత్రం విడుదల చేయండి

సారథి న్యూస్, రామాయంపేట: తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ సబ్​ ప్లాన్ సరిగ్గా అమలుకావడం లేదని ఎస్సీ, ఎస్టీ బడ్జెట్ రాష్ట్ర కన్వీనర్ పి.శంకర్ అన్నారు. ప్రత్యేకాభివృద్ధికి కేటాయించిన బడ్జెట్, ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. ప్రత్యేక ‌అభివృద్ధి నిధి చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని డిమాండ్​ చేస్తూ బహుజన రిసోర్స్ సెంటర్ (డీబీఆర్సీ) ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచారోద్యమ కరపత్రాలను మంగళవారం నిజాంపేటలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.. ఈ ఆర్ధిక సంవత్సరంలో దళితుల అభివృద్ధికి రూ.16,173వేల కోట్ల నిధులు కేటాయించగా, కేవలం రూ.3,547 కోట్లను మాత్రమే ఖర్చుచేశారని వివరించారు. స్వయం ఉపాధి పథకాలను సక్రమంగా అమలు చేయడం లేదని ఆక్షేపించారు. జిల్లాలో కేవలం 347 కుటుంబాలకు మాత్రమే 830.16 ఎకరాల భూమిని మాత్రమే పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారని అన్నారు. మూడేళ్లుగా ఎకరా భూమిని కూడా దళితులకు పంపిణీ చేయలేదన్నారు. కార్యక్రమంలో డీబీఆర్​సీ జిల్లా కోఆర్డినేటర్​ దుబాషి సంజీవ్, మాజీ ఎంటీసీ తమ్మల రమేష్, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు టంకరి లక్ష్మణ్, బత్తుల బాల్ నర్సు, బాగయ్య, బండారి శ్రీను, బండారు కుమార్, గుడ్ల బాబు పాల్గొన్నారు.