సారథి న్యూస్, రామాయంపేట: రాష్ట్ర ప్రభుత్వం సన్నవడ్లకు గిట్టుబాటు ధర కల్పించాలని బీజేపీ నిజాంపేట బీజేపీ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్ అన్నారు. సోమవారం పార్టీ ఆధ్వర్యంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ స్థానిక తహసీల్దార్ జయరామ్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సన్నవరికి రూ.2,500, పత్తికి రూ.8,000, అలాగే నీట మునిగిన పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని, లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వివరించారు. కార్యక్రమంలో రాజిరెడ్డి, ప్రశాంత్ కుమార్, నవీన్, ప్రవీణ్ కుమార్, రైతులు పోచయ్య, రాజయ్య పాల్గొన్నారు.
- November 9, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- BJP
- MSP
- NIZAMPET
- RAMAYAMPET
- గిట్టుబాటు
- నిజాంపేట
- బీజేపీ
- రామాయంపేట
- Comments Off on సన్నాలకు గిట్టుబాటు ధర ప్రకటించాలే