Breaking News

సంక్షేమ రంగానికి పెద్దపీట

సారథి న్యూస్​, అమరావతి: ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం రెండోదఫా 2020–21 బడ్జెట్​ను ప్రవేశపెట్టింది. రూ.2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో సంక్షేమ బడ్జెట్‌ను రూపొందించింది. మంగళవారం అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, శానసమండలిలో డిప్యూటీ సీఎం సుభాష్‌చంద్రబోస్‌ ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం అంచనా రూ.1,80,392.65 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.44,396.54 కోట్లుగా ప్రకటించారు. బీసీ సంక్షేమానికి గతేడాది కంటే 270 శాతం అదనంగా కేటాయించాయి. వ్యవసాయ రంగానికి రూ. 11,891 కోట్లు, ఆరోగ్య రంగానికి రూ.11,419.44 కోట్లు, పశుగణాభివృద్ధి, మత్స్యరంగానికి రూ.1279.78 కోట్లు, గృహ నిర్మాణ రంగానికి రూ.3,691.79 కోట్లు, హోంశాఖకు రూ.5,988.72 కోట్లు, జలవనరుల శాఖకు రూ. 11,805.74 కోట్లు, పెట్టుబడులు, మౌలిక వసతుల రంగానికి రూ.696.62 కోట్లు, ఐటీ రంగానికి రూ. 197.37 కోట్లు, కార్మిక సంక్షేమానికి రూ. 601.37 కోట్లు, పంచాయతీరాజ్, రూరల్‌ డెవలప్‌మెంట్‌కు రూ. 16710.34 కోట్లు, న్యాయశాఖకు రూ. 913.76 కోట్లు, మున్సిపల్‌ పట్టణాభివృద్ధి శాఖలకు రూ. 8150.24 కోట్లు, స్కిల్స్​ డెవలప్‌మెంట్‌కు రూ.856.64 కోట్లు, పౌరసరఫరాల శాఖకు రూ.3,520.85 కోట్లు, ఆర్థిక రంగానికి రూ.50,703 కోట్లు, విద్యుత్‌ రంగానికి రూ.6,984.72 కోట్లు, ప్రాథమిక ఉన్నత విద్యకు రూ.22,604.01 కోట్లు, సోషల్‌ వెల్ఫేర్‌ కోసం రూ.12,465.85 కోట్లు, ట్రాన్స్‌పోర్టు, ఆర్‌అండ్‌బీ కోసం రూ.6,588.58 కోట్ల చొప్పున కేటాయించారు. గ్రామీణాభివృద్ధికి రూ.16,710 కోట్లు, సాగునీటి పారుదల శాఖకు రూ.11,805 కోట్లు, రవాణా రంగానికి రూ.6,588 కోట్లు, డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కోసం రూ.2100 కోట్లు, నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ కోసం రూ.1808.03 కోట్లు కేటాయించారు.