Breaking News

సంక్షేమ పథకాలు అందరికీ చేరాలి

సంక్షేమ పథకాలు అందరికీ చేరాలి

సారథి న్యూస్​, శ్రీకాకుళం: గ్రామీణ ప్రాంతాల‌ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రతిఒక్కరికీ చేరాల‌ని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ అన్నారు. సోమవారం ఆయన శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. తన పర్యటనలో భాగంగా సీతంపేట మండల‌ కేంద్రంలో గ్రామసచివాలయాన్ని పరిశీలించారు. పెద్దూరులో గ్రామ సచివాలయాన్ని రూ.40 ల‌క్షలు, వైఎస్సార్​హెల్త్‌ క్లినిక్‌ ను రూ.17.50 ల‌క్షలు, రూ.21.80 లక్షల వ్యయంతో చేపడుతున్న వైఎస్సార్​ రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించారు. సీతంపేట గురుకుల‌ పాఠశాల‌లో ‘నాడు నేడు’ పనులు పరిశీలించారు. ‘నాడు నేడు’ పనుల‌కు సీఎం జగన్‌ అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. మరుగుదొడ్లలో నిరంతర నీటి సరఫరా ఉండాల‌ని సూచించారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్‌ జె నివాస్‌, జాయింట్‌ కలెక్టర్లు డాక్టర్​ శ్రీనివాసు, సుమిత్‌ కుమార్‌, ఆర్‌.శ్రీరామునాయుడు, ఐటీడీఏ పీవో సీహెచ్‌.శ్రీధర్‌, టెక్కలి సబ్‌ కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ్‌, సహాయ కలెక్టర్‌ ఎం.నవీన్‌, పీఆర్‌ ఎస్‌ఈ ఎస్‌.రామ్మోహన్‌, వ్యవసాయశాఖ జేడీ కె.శ్రీధర్‌, గిరిజన సంక్షేమశాఖ డీడీ ఎం.కమ, ఈఈ జి.మురళి, గురుకులం ప్రిన్సిపల్‌ సురేష్‌ కుమార్‌ పాల్గొన్నారు.