Breaking News

షూటింగ్​కు రెడీ

షూటింగ్​కు రెడీ

టాలీవుడ్ హీరోలెవరూ షూటింగ్ చేసేందుకు ముందుకు రావడం లేదు. కానీ కన్నడ హీరోలు మాత్రం షూటింగ్​కు సై అంటున్నారు. రీసెంట్ గా సుదీప్ కిచ్చా ‘ఫాంటమ్’ సినిమా షూటింగ్ ను అన్నపూర్ణ స్టూడియోస్ లో మొదలుపెట్టి షాకిచ్చారు. ఈ బాటలోనే మరో కన్నడ హీరో ఉపేంద్ర కూడా వస్తున్నారు. వెర్సటైల్ హీరో ఉపేంద్ర నటిస్తున్న ‘కబ్జా’ చిత్రంతో పాటు తెలుగులో కూడా ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అల్లు అర్జున్ సోదరుడు అల్లు బాబీ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘బాక్సర్’ లో ఉపేంద్ర నటిస్తున్నట్టు సమాచారం. వచ్చేనెల తిరిగి ప్రారంభం కానున్న ఈ షూటింగ్ కోసం ఉపేంద్ర హైదరాబాద్ రానున్నట్టు తెలిసింది. భారీ కాస్టింగ్​తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ సరసన బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ హీరోయిన్​గా నటిస్తున్నారు.