సారథి న్యూస్, కర్నూలు: ఇటీవల కురుస్తున్న భారీవర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఎగువ ప్రాజెక్టుల నుంచి వరద ఉధృతి కొనసాగుతుండడంతో ఇప్పటికే పదిగేట్లను ఎత్తివేసి నాగార్జునసాగర్జలాశయానికి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు భద్రత, నీటి మట్టం, విద్యుదుత్పత్తి.. తదితర వాటిని పరిశీలించేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగస్టు 21న శుక్రవారం శ్రీశైలం రానున్నారు. ఉదయం 11 గంటలకు ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో శ్రీశైలంలోని సున్నిపెంట హెలిప్యాడ్ లో దిగుతారు. అక్కడి నుంచి జెన్కో గెస్ట్‌హౌస్‌కు వెళ్లి, అనంతరం శ్రీశైలం డ్యాం వద్దకు వెళ్లి పరిశీలిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు ఏరియల్ సర్వే ద్వారా కర్నూలు జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులను చూసుకుని విజయవాడకు తిరిగి వెళ్తారని కర్నూలు కలెక్టర్ జి.వీరపాండియన్ గురువారం విలేకరులకు తెలిపారు.
- August 20, 2020
- Top News
- ఆంధ్రప్రదేశ్
- APCM JAGAN
- Kurnool
- SRISAILAM
- ఏపీ సీఎం జగన్
- కర్నూలు
- శ్రీశైలం
- Comments Off on శ్రీశైలానికి సీఎం జగన్