Breaking News

శ్రీశైలానికి కృష్ణమ్మ పరవళ్లు

శ్రీశైలానికి కృష్ణమ్మ పరవళ్లు
  • డ్యామ్​లో 815 అడుగుల నీటిమట్టం
  • జూరాల 8గేట్లు ఎత్తి నీటి విడుదల

సారథి న్యూస్, కర్నూలు: ఎగువ నుంచి వస్తున్న భారీ వరదలకు శ్రీశైలం జలాశయంలోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ఉరకలెత్తుతోంది. కర్ణాటక, మహారాష్ర్ట ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో ఆల్మట్టి డ్యాం నుంచి నారాయణపూర్‌కు నీటిని వదిలారు. అక్కడి నుంచి జూరాలకు ప్రస్తుతం 60వేల క్యూసెక్కుల వరద నీరు కొనసాగుతోంది. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుతం 318.440 మీటర్లకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 9.500 టీఎంసీల నీటినిల్వ ఉంది. జూరాల నుంచి 60వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.


శ్రీశైలం ప్రాజెక్టుకు పెరిగిన వరద
శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. బుధవారం 49,895 క్యూసెక్కుల వరద నీరు చేరిందని అధికారులు తెలిపారు. జూరాల ప్రాజెక్టు నుంచి 48,795 క్యూసెక్కుల, హంద్రీనీవా నుంచి 1,100 క్యూసెక్కు వరద నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. అయితే ప్రాజెక్టు పూర్తిస్థాయి కెపాసిటీ 885 అడుగులు కాగా, నీటి నిల్వ సామర్థ్యం 376.570 టీఎంసీలు. కాగా, ప్రస్తుతం 815 అడుగుల నీటిమట్టం ఉండగా, ప్రస్తుతం 217 టీఎంసీ నీటి నిల్వ ఉంది. ఎగువ కృష్ణానది పరీవాహక ప్రాంతాలు, నల్లమల అడవుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీస్థాయిలో వరదనీరు వచ్చి చేరే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.