సారథి న్యూస్, అచ్చంపేట: తెలంగాణ పరిధిలోని శ్రీశైలం పాతాళగంగ జెన్కో పవర్‌హౌస్‌లో అగ్నిప్రమాదం జరిగి 9 మంది మృత్యువాతపడిన విషయం తెలిసిందే. ప్రమాదస్థలిని పరిశీలించేందుకు వెళ్తున్న తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాల్కాజిగిరి ఎంపీ ఎ.రేవంత్ రెడ్డిని నల్లగొండ జిల్లా డిండి వద్ద పోలీసులు పోలీసులు అరెస్ట్ చేసి ఉప్పునుంతల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సంఘటన జరిగిన తీరును తెలుసుకుని బాధిత కుటుంబాలకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా తమపై ఉందని, విచారణకు ఎలాంటి ఇబ్బందులు కలిగించబోమని తనను అడ్డుకున్న పోలీసులతో ఎంపీ రేవంత్‌రెడ్డి వాదనకు దిగారు. అలాగే నాగర్‌కర్నూల్ డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణను పోలీసులు కల్వకుర్తిలోనే హౌస్ అరెస్ట్‌చేసి ఉంచారు.
- August 22, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- పొలిటికల్
- POWERHOUSE
- REVANTHREDDY
- SRISAILAM
- ఎంపీ రేవంత్‌రెడ్డి
- పవర్‌హౌస్
- శ్రీశైలం
- Comments Off on శ్రీశైలం వెళ్తున్న రేవంత్‌రెడ్డి అరెస్ట్