Breaking News

శ్రీశైలం ఆరుగేట్ల ఎత్తివేత

శ్రీశైలం ఆరుగేట్ల ఎత్తివేత

సారథి న్యూస్, కర్నూలు, మానవపాడు(జోగుళాంబ గద్వాల): శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుకోవడంతో నీటిని విడుదల చేస్తున్నారు. ఒకేసారి 13లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అలాగే ఎగువ ఉన్న జూరాల ప్రాజెక్టు నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం 17గేట్లను ఎత్తివేశారు. 1,51,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. ఔట్ ఫ్లో 1,59,542 క్యూసెక్కులుగా నమోదైంది. నీటి ప్రవాహంతో బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ఆహ్లాద వాతావరణాన్ని పంచుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు నీటి ఉధృతి పెరగడంతో ఆరు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.

జోగుళాంబ గద్వాల జిల్లా బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండగా ఆహ్లాద వాతావరణం