సారథి న్యూస్, హైదరాబాద్: రాఖీ పౌర్ణమి సోమవారం ఇంంటింటా వేడుకగా జరిగింది. అక్కాచెల్లెళ్లు.. తమ తమ్ముళ్లు, అన్నలకు రాఖీలు కట్టి దీవించారు. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌కు ఆయన సోదరి రాఖీ కట్టారు. తన సోదరి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. అలాగే గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపీ మలోత్ కవిత, ప్రభుత్వ విప్ గొంగడి సునిత, టీఆర్ఎస్ నాయకురాలు గుండు సుధారాణి తదితరులు కలిసి తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావును ప్రగతిభవన్‌లో కలిసి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ఎంపీ కవిత సోదరుడు కేటీఆర్‌కు రాఖీ కట్టారు. అనంతరం వారికి కేటీఆర్దంపతులు సారెచీరెలు పెట్టి పంపించారు. అలాగే మహబూబ్‌నగర్‌జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యేకు ఆయన సోదరి రాఖీ దీవెనలు అందించారు.
- August 3, 2020
- Archive
- Top News
- CM KCR
- KTR
- RAKHI PURNIMA
- TELANGANA
- కేటీఆర్
- తెలంగాణ
- రక్షాబంధన్
- రాఖీ పౌర్ణమి
- Comments Off on శ్రీరామ ‘రక్ష’