శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రమూకలు రెచ్చిపోతున్నాయి. స్థానికుల అండదండలతో చెలరేగిపోతున్నాయి. తాజాగా శ్రీనగర్‌లోని పంతాచౌక్ వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ దళాలపై ఉగ్రమూక ఒక్కసారిగా దాడులకు తెగబడింది. వెంటనే అలర్టయిన జవాన్లు ఎదురుదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. మరోవైపు సీఆర్పీఎఫ్కు చెందిన ఓ అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ కూడా ప్రాణాలు కోల్పోయారు. కాగా ఈ ఘటనతో శ్రీనగర్ అట్టుడుకింది. ఇరు వర్గాలు దాదాపు గంటపాటు ఫైరింగ్ చేసుకున్నట్టు సమాచారం.
- August 30, 2020
- Archive
- Top News
- జాతీయం
- CRPF
- ENCOUNTER
- POLICE
- SATURDAY
- SRINAGAR
- TERRORISTS
- ఎన్కౌంటర్
- ముగ్గురు ఉగ్రవాదులు
- శ్రీనగర్
- సీఆర్పీఎఫ్
- హతం
- Comments Off on శ్రీనగర్‌లో ఎన్కౌంటర్.. ముగ్గురు హతం