టాలీవుడ్.. కోలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శృతిహాసన్. మంచి ఫామ్ లో ఉన్నప్పుడు సినిమాలకు బ్రేక్ అప్ ఇచ్చి ఇప్పుడు మళ్లీ ఫామ్ లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. రవితేజ ‘క్రాక్’ సినిమాలో నటిస్తోంది. హీందీలో విద్యత్ జమ్వాల్ తో చేసిన ‘యారా’ సినిమా రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ కానుంది. అయితే శృతి చెల్లెలు అక్షర హాసన్ చెల్లెలు అన్న విషయం అందరికీ తెలిసిందే. ‘మిస్టర్ కెకె’లో కీలక పాత్ర పోషించింది ఈ బ్యూటీ. అయితే అక్క చెల్లెళ్లు ఇద్దరూ కలిసి ఏ సినిమాలోనూ ఇంత వరకూ నటించలేదు. ఇప్పుడు అది జరగనుందట.
తాజా సమాచారం ప్రకారం..శృతి అక్షర హాసన్ లిద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపించి అభిమానులకు పండుగ చేయనున్నారట. అది కూడా హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘డోంట్ బ్రీత్’ రీమేక్ లో నటించేందుకు రెడీ అవుతున్నారని తెలిసింది. ఈ సినిమాలో చియాన్ విక్రమ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ‘డోంట్ బ్రీత్’ తమిళంలో రీమేక్ కానుంది. తెలుగులో కూడా రిలీజయ్యే అవకాశం ఉండొచ్చు. ఓ అంధుడైన ఆర్మీ మేజర్ ఇంట్లో దొంగతననాకి ట్రై చేసి ముప్పు తిప్పలు పడే ముగ్గురు టీనేజ్ దొంగల కథ ఇది. ‘అవతార్’ చిత్రంలో విలన్ గా కనిపించిన స్టీఫెన్ లాంగ్ హాలీవుడ్ మూవీలో ఆర్మీ మేజర్ గా నటించారు.
జేన్ లెవీ, డేనియల్ జొవాటో, డైలాన్ మినెట్టే తదితరులు టీనేజీ దొంగలుగా నటించారు. తమిళ రీమేక్ లో స్టీఫెన్ పోషించిన ఆర్మీ మేజర్ పాత్రలో చియాన్ విక్రమ్ నటిస్తారు. ఇక జేన్ నటించిన ఫీమేల్ దొంగ పాత్రలో శృతిహాసన్ నటిస్తుంది. అయితే అక్షర హాసన్ పాత్ర ఇందులో అతిథి పాత్ర మాత్రమేనా లేక ఎన్ లార్జ్ చేసి ఫుల్ లెంగ్త్ లో చూపిస్తారా? అన్నది ఇంకా కన్ఫామ్ కాలేదట. ఆర్మీ మేజర్ ఇంట్లో కిడ్నాప్ నకు గురైన యువతి పాత్రను అక్షర పోషిస్తుందేమో అని టాక్.