ఆది సాయికుమార్ హీరోగా, శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకత్వంలో సస్పెన్ థ్రిల్లర్ నేపథ్యంలో ‘శశి’ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి. ప్రస్తుతం ఆది తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారు. ఆది గత సినిమాల కంటే ఈ సినిమా భిన్నంగా ఉంటుంది. ఇప్పటివరకు కనిపించని సరికొత్త రూపంలో ఆది ఈ సినిమాలో కనిపించనున్నారు. రీసెంట్గా రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో ఆది ‘శశి’ అనే ఓ మాస్ పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది. చేతిలో మైక్ పట్టుకుని కూల్‌గా ఒకటి, బ్యాక్ గ్రౌండ్‌లో గుబురు గడ్డం, జుట్టుతో కనిపిస్తున్న ఆది లుక్ మరొకటి. రెండు వేరియేషన్స్ చూపించిన ఈ ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వచ్చింది.
ఈ సినిమాలో సురభి, రాశీ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై ఆర్‌పీ వర్మ, రామాంజనేయులు, శ్రీనివాస్ చింతలపూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా అనంతరం రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా ఒక పాట మినహా సినిమా షూటింగ్ అంతా పూర్తయింది. ఆ పాటను కూడా మూడు రోజుల్లో పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వెన్నెల కిశోర్, తులసి, జయప్రకాష్, రాజీవ్ కనకాల, అజయ్, వైవా హర్ష, సుదర్శన్, స్వప్నిక, శిరీష, శరణ్య, హర్ష, మహేష్, కృష్ణతేజ, భద్రం, వేణుగోపాలరావు కీలక పాత్రలు పోషించారు. లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘శశి’ సినిమాకు అరుణ్ చిలువేరు సంగీతం సమకూరుస్తుండగా, అమర్‌నాథ్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు.