Breaking News

శనీశ్వర స్వామికి విశేష పూజలు

శనేశ్వర స్వామికి విశేషపూజలు

సారథి న్యూస్, నాగర్​కర్నూల్: కార్తీకమాసం శనివారం త్రయోదశి సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వడ్డెమాన్ గ్రామంలోని సార్థసప్త శనీశ్వర స్వామి ఆలయంలో భక్తులు అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. శనీశ్వర స్వామివారికి నువ్వుల నూనె, నల్లని వస్త్రాలు, బెల్లంతో చేసిన ఆహార పదార్థాలను ప్రత్యేకంగా నివేదన చేశారని ఆలయ ప్రధానార్చకులు డాక్టర్ గవ్వ మఠం విశ్వనాథశాస్త్రి అన్నారు. అష్టోత్తర నామాలు, నల్లనువ్వులు నల్లటి వస్త్రం, నువ్వుల నూనె జిల్లేడు పూలు పలు ద్రవ్యాలతో కొలిస్తే స్వామివారి కరుణ, కృపా కటాక్షాలు భక్తులపై ఉంటాయని అన్నారు. శనిగ్రహం నివారణ దోషాలు తొలగి ఉద్యోగం, వ్యాపారం కోర్టు కేసులు, ఆరోగ్యం, శత్రు బాధ నివారణకు శనీశ్వరస్వామిని కొలవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో శ్రీశైల దేవస్థాన పూజారి శ్రీశైలం, శనీశ్వర స్వామి ఆలయ అర్చకులు శాంతికుమార్, ఉమ్మయ్య, శివసాయి సృజన్, విశ్వ ఆరాధ్య, మల్లికార్జున్, టీ చెన్నయ్య, రేవెల్లి సర్కిల్ ఇన్​స్పెక్టర్ ​అరుణ్ కుమార్, ఆలయం ధర్మకర్త గోపాల్ రావు, కమిటీ సభ్యులు ప్రభాకరచారి, వీరశేఖరాచారి, గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.