సారథి న్యూస్, హైదరాబాద్: వ్యవసాయ శాఖ పై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరచడానికి, స్వతంత్ర భారతంలో గతంలో ఎన్నడూ..ఎక్కడా జరగనంత ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతోందని సమావేశంలో పాల్గొన్న అధికారులను, మంత్రులనుద్దేశించి మాట్లాడారు. కోట్లాది రూపాయల ఖర్చుతో ప్రాజెక్టుల నిర్మిస్తున్నట్లు తెలిపారు. రైతులకు ఉచితంగా సాగునీరు అందిస్తూ.. ఒక్క రూపాయి భూమిశిస్తు తీసుకోవద్దనే లక్ష్యంతో నీటి తరువాయి విధానాన్ని రద్దు చేయడంతో పాటు పాత బకాయిలను ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బి .జనార్దన్ రెడ్డి. అడిషనల్ డైరెక్టర్ విజయ్ కుమార్, శైలజ పాల్గొన్నారు.
- July 23, 2020
- Archive
- తెలంగాణ
- హైదరాబాద్
- Farmers
- KCR
- PROJECTS
- కేసీఆర్
- ప్రాజెక్టులు
- రైతులు
- Comments Off on వ్యవసాయ శాఖపై సీఎం సమీక్ష