Breaking News

వైభవంగా నితిన్​, షాలినీ పెండ్లి

వైభవంగా నితిన్​, షాలినీ పెండ్లి


హైదరాబాద్ లోని ఫలక్ నుమా ప్యాలెస్ లో జులై 26 ఆదివారం రాత్రి 8:30 గంటలకు నితిన్, షాలినీ ల పెళ్లి వైభవంగా జరిగింది. కరోనా నిబంధనలను పాటిస్తూ అతికొద్దిమంది ఆత్మీయులు సన్నిహితుల సమక్షంలో పెద్దలు అంగరంగవైభవంగా జరిపించారు ఈ వేడుకను. ఈ పెళ్లి కి సినీ ఇండస్ట్రీ నుంచి నితిన్ బెస్ట్ ఫ్రెండ్స్ వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, హీరో కార్తికేయ హాజరయ్యారు. ఈ అలాగే ఈ వేడుకలో సినీ రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. వివాహం తరువాత షాలినీ మెడలో తాళి కడుతున్న ఫొటోను ట్విటర్​ లో షేర్ చేసిన నితిన్ ‘మొత్తానికి ఓ ఇంటివాడినయ్యా.. మీ దీవెనలు కావాలి’ అని కోరాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే పెళ్లి పనులు ప్రారంభించిన నితిన్ లాక్ డౌన్ కారణంగా వివాహ వేడుకను వాయిదా వేస్తూ వచ్చాడు. ఇప్పట్లో పరిస్థితులు చక్కబడే పరిస్థితి కనిపించకపోవటంతో కుటుంబసభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఆదివారం రాత్రి పెళ్లి షాలిని మెడలో మూడు ముళ్లు వేశాడు.