బిజినేపల్లి , సారథి న్యూస్: ఆర్ఎంపీ వైద్యం వికటించి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఆగ్రహించిన బాధితుడి కుటుంబసభ్యులు ఆర్ఎంపీ దవాఖాన ఎదుట ఆందోళన చేపట్టారు. పోలీసులు వచ్చి ఆర్ఎంపీని అదుపులోకి తీసుకున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మంగనూర్‌కు చెందిన శ్రీనివాస్‌రెడ్డి(35) తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబసభ్యులు అదే గ్రామంలోని వేంకటేశ్వర ప్రాథమిక చికిత్స కేంద్రం లో ఉన్న ఆర్ఎంపీ వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారు. అతడికి పెరాలసిస్ వచ్చినట్టు నిర్దారించుకొన్న వైద్యుడు అతడికి మందులు, ఇంజెక్షన్లు ఇచ్చాడని బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపించారు. మూడ్రోజుల్లో నయమవుతుందని చెప్పి ఇంటికి పంపించారు. మూడు రోజుల పాటు మందులు వాడిన శ్రీనివాస్ రెడ్డి ఆదివారం మృతి చెందాడు. ఆగ్రహించిన అతడి కుటుంబీకులు మృతదేహాన్ని తీసుకొని ఆర్ఎంపీ కేంద్రం వద్ద మృతదేహాన్ని ఉంచి మూడు గంటల పాటు ఆందోళన చేశారు. ఆర్ఎంపి వరప్రసాద్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. కుటుంబీకులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని ఎస్సై వెంకటేశ్ తెలిపారు.
- June 28, 2020
- Archive
- క్రైమ్
- తెలంగాణ
- BIJINEPALLY
- NAGARKURNOOL
- RMP
- TREAT
- ఆర్ఎంపీ
- వైద్యుడు
- Comments Off on వైద్యం వికటించి వ్యక్తి మృతి