విజయవాడ రమేశ్ హాస్పిటల్స్ వ్యవహారంపై సంచలన ట్వీట్లు పెట్టిన రామ్ పోతినేని వెనక్కి తగ్గాడు. ఇకమీదట తాను ఈ ఘటనపై ఎటువంటి ట్వీట్లు పెట్టబోనని మరో ట్వీట్పెట్టాడు. న్యాయంపై తనకు నమ్మకుందని చెప్పుకొచ్చాడు. నిజమైన దోషులకు శిక్షపడుతుందని భావిస్తున్నా అని చెప్పాడు. రామ్ ట్వీట్లు సంచలనంగా మారడంతో.. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగం ఓ రేంజ్లో విరుచుకుపడింది. స్వర్ణప్యాలెస్‌లో 10 మంది చనిపోతే స్పందించని రామ్.. ఇప్పడు ఆయన బంధువు మీదకొచ్చేసరికి నీతులు బోధిస్తున్నాడంటూ ఫైర్ అయ్యారు వైఎస్సార్సీపీ నేతలు. మరోవైపు రామ్ ట్వీట్లపై పోలీసులు కూడా స్పందించారు. కేసును ప్రభావితం చేస్తున్నందును ఈ హీరో రామ్‌కు నోటీసులు అందిస్తామని విజయవాడ ఏసీపీ ఓ ప్రకటన విడుదల చేశారు. విచారణ జరుగుతున్న ఓ కేసుపై ట్వీట్లు పెట్టడం సరికాదని పరోక్షంగా హెచ్చరించారు. మరోవైపు నెటిజన్లు కూడా రామ్ వ్యవహారశైలిపై మండిపడ్డారు. దీంతో రామ్ పోతినేని మనసు మార్చుకున్నాడు.
- August 17, 2020
- Archive
- Top News
- సినిమా
- HYDERABAD
- RAM POTHINENI
- RAMESH HOSPITALS
- TWEET
- TWEETS
- ట్వీట్లు
- రామ్పోతినేని
- సినీహీరో
- Comments Off on వెనక్కి తగ్గిన హీరో రామ్