సారథి న్యూస్, హైదరాబాద్: దేశ సరిహద్దుల్లో జరిగిన ముష్కరుల కాల్పుల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన వీరజవాన్ మహేష్ మృతిచెందడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన యోధుడిగా మహేష్ చరిత్రలో నిలిచిపోతారని సీఎం కేసీఆర్ కొనియాడారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. జవాన్ కుటుంబానికి ప్రభుత్వపరంగా రూ.50లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్లు వెల్లడించారు. అర్హతను బట్టి కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపారు. మహేష్ కుటుంబానికి ఇంటి స్థలం కూడా కేటాయిస్తామని వెల్లడించారు.
- November 10, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- CM KCR
- NIZAMABAD
- SOLDIER MAHESH
- తెలంగాణ
- నిజామాబాద్
- మహేష్
- సీఎం కేసీఆర్
- Comments Off on వీరజవాన్ మహేష్ కుటుంబానికి అండగా ఉంటాం..