సారథి న్యూస్, కర్నూలు: ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్ నిధి ద్వారా వీధి వ్యాపారులకు రూ.10వేల రుణసాయాన్ని అందించేందుకు ప్లాన్ చేయాలని కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డీకే బాలాజీ సూచించారు. బుధవారం ఆయా బ్యాంకుల ఉన్నతాధికారులు, వీధి వ్యాపారుల సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. లాక్ డౌన్ కారణంగా నష్టపోయిన చిరువ్యాపారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారికి చేయుతనివ్వడానికి రుణాల మంజూరుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు. తీసుకున్న రుణాన్ని సక్రమంగా తిరిగి చెల్లించిన వారికి ప్రోత్సాహకంగా చెల్లించిన వడ్డీతో ఏడుశాతం వడ్డీ ప్రతి మూడు నెలలకు ఒకసారి తిరిగి ఖాతాలో జమవుతుందని వెల్లడించారు. జులై 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ పథకంపై మెప్మా సిబ్బంది విస్తృతంగా ప్రచారం చేస్తూ సర్వే నిర్వహించాలని ఆదేశించారు. మెప్మా పీడీ తిరుమలేశ్వర్ రెడ్డి, అడిషనల్ కమిషనర్ పీవీ రామలింగేశ్వర్, లీడ్ బ్యాంక్ మేనేజర్ నగేష్ పాల్గొన్నారు.
- June 24, 2020
- Archive
- ఆంధ్రప్రదేశ్
- కర్నూలు
- CARPORATION
- Kurnool
- ఆత్మ నిర్భర్
- కర్నూలు
- Comments Off on వీధి వ్యాపారులకు ఆర్థిక భరోసా