Breaking News

విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టొద్దు

విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టొద్దు

హైదరాబాద్​: సోషల్‌ మీడియా పోస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తిచేశారు. సోషల్ మీడియాలో తప్పడు పోస్టులు బెంగళూరులో ఎంత విద్వేషానికి దారి తీశాయో, ఎంత ప్రాణ, ఆస్తినష్టానికి కారణమైందో తెలుసుకోవాలని కోరారు. శాంతి భద్రతలను దెబ్బతీసే అలాంటి పోస్టులు పెట్టొద్దని సూచించారు. సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిని తెలంగాణ పోలీసులు నిరంతరం గమనిస్తున్నారని, అలాంటి వారిపై వెంటనే కేసులు పెట్టి, కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ మేరకు ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లు, సీనియర్ అధికారులకు ఆదేశాలిచ్చామని తెలిపారు. ప్రజలు పోలీసులతో సహకరించి భద్రత, రక్షణలో తెలంగాణ అత్యున్నతంగా నిలిచేలా సహకరించాలని కోరారు. కాగా, కర్ణాటకకు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి బంధువు నవీన్‌ సోషల్‌ మీడియాలో ఓ కమ్యూనల్‌ పోస్టు షేర్‌ చేయడంతో బెంగళూరులో తీవ్రఘర్షణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కాల్పులు జరపడంతో ఇద్దరు మృతి చెందారు.