సారథి న్యూస్, కర్నూలు: విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా కల్పించడమే సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి లక్ష్యమని వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు రాజావిష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. గురువారం నగరంలోని 23వ వార్డు ఇన్‌చార్జ్ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో మున్సిపల్ హైస్కూలులో ‘జగనన్న విద్యాకానుక’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజావిష్ణువర్ధన్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి తెర్నెకల్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో 43 లక్ష మంది విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కింద రూ.650 కోట్లు విలువ చేసే మూడు జత యూనిఫాం, బ్యాగు, బూట్లు, రెండు జతల సాక్సులు, టై, బెల్టులు, పుస్తకాలు అందజేయడం సంతోషకరమన్నారు. విద్యార్థులు బాగా చదివి అన్నిరంగాల్లో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి రియల్ టైం నాగరాజు యాదవ్, దేవపూజ ధనుంజయ ఆచారి, యువజన విభాగం నగర అధ్యక్షుడు సోంపల్లి కృష్ణకాంత్ రెడ్డి, ఎస్టీ సెల్ నాయకుడు శ్రీనివాస్ నాయక్, విజయ్ కుమార్, సూరి, ప్రవీణ్, టీచర్లు పాల్గొన్నారు.
- October 8, 2020
- Archive
- ఆంధ్రప్రదేశ్
- లోకల్ న్యూస్
- CM JAGAN
- JAGANANNA VIDYAKANUKA
- Kurnool
- YSRCP
- కర్నూలు
- జగనన్న విద్యాకానుక
- వైఎస్సార్సీపీ
- సీఎం జగన్
- Comments Off on విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా