లక్నో: దేశంలోనే సంచలనం సృష్టించిన వికాస్‌దూబే కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. వికాస్ దుబేను పట్టుకొనేందుకు వెళ్లిన 8 మంది పోలీసులను అతడి అనుచరులు దారుణంగా కాల్చిచంపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వికాస్‌దూబేకు కొందరు పోలీసులే సహకరించినట్టు విచారణలో తేలింది. దీంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ మేరకు వికాస్దూబేతో సంబంధం ఉన్నట్లు అనుమానాలు ఉన్న 200 మంది పోలీసులపై నిఘా పెంచారు. ముఖ్యంగా చౌబేపూర్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేసిన, పనిచేస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు కాన్సూర్ ఐజీ మోహిత్ అగర్వాల్ అన్నారు. వాళ్లంతా ఒకప్పుడు దుబేతో సంబంధాలు కలిగి ఉన్నవారే అని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 10 మందిని సస్పెండ్ చేశారు. ఇంకా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయని అన్నారు. దాదాపు 60 కేసుల్లో వికాస్ దుబే నిందితుడు.
- July 7, 2020
- Archive
- Top News
- KANPOOR
- LAKNOW
- POLICE
- VIKAS DHUBE
- పోలీసులు
- వికాస్‌దూబే
- Comments Off on వికాస్‌దూబేకు సహకరించిన పోలీసులెవరు