సారథి న్యూస్, హైదరాబాద్: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో వాహనాల ఫిట్‌నెస్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సహా ఇతర వాహన సంబంధిత పత్రాల చెల్లుబాటును 2020 డిసెంబర్31వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, యూటీలకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ అడ్వయిజరీ పంపించింది. లాక్ డౌన్ నేపథ్యంలో వాహన పత్రాల చెల్లుబాటును ఇంతకుముందు మార్చి 30 నుంచి జూన్ 30వ తేదీ వరకు పొడిగించింది. ఆ తర్వాత సెప్టెంబర్30కు పొడిగించింది. ప్రస్తుతం కరోనా కేసులు పెద్దసంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి వ్యాలిడిటీని కేంద్రం ప్రభుత్వం పొడిగించింది. వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలు ఈ ఏడాది ఆఖరు వరకు చెల్లుబాటు అవుతాయని మంత్రి నితిగ్ గడ్కరీ ప్రకటించారు.
- August 24, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- CENTRAL GOVT
- NITHIN GADKARI
- REGISTRATION
- VEHICLE FITNESS
- కేంద్రప్రభుత్వం
- రిజిస్ట్రేషన్
- వెహికిల్ఫిట్నెస్
- Comments Off on వాహనదారులకు కేంద్రం గుడ్న్యూస్