న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయతాండవం సృష్టిస్తున్నది. గత 24 గంటల్లోనే దాదాపు 90,632 కొత్తకేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. మరోవైపు 1065 మంది కరోనాకు బలయ్యారు. మొత్తం కేసులసంఖ్య 41,13,811 కు పెరిగింది. ప్రస్తుతం 8,62,320 యాక్టివ్ కేసులు ఉండగా.. 70,626 మంది మృత్యువాత పడ్డారు. కాగా కొంత ఊరటనిచ్చే అంశం ఏమిటంటే.. ఇప్పటివరకు 31,80,865 మంది కోలుకున్నారు. టెస్టులు ఎక్కువగా చేస్తున్నందునే.. ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10,92,654 కరోనా టెస్టులు జరిగాయని, ఇప్పటివరకు 4,88,31,145 మందికి కరోనా టెస్టులు నిర్వహించామని ఐసీఎంఆర్ వెల్లడించింది.
- September 6, 2020
- Archive
- Top News
- జాతీయం
- CARONA
- DELHI
- HEALTHBULLETIN
- INDIA
- NEWCASES
- కరోనా
- కొత్తకేసులు
- ఢిల్లీ
- రికవరీ
- Comments Off on వామ్మో కరోనా కబలిస్తోంది..