- గుండెపోటుతో కొడుకు వెంకటేష్ మృతి
ప్రముఖ సీనియర్ నటి, కళాభినేత్రి వాణిశ్రీ ఇంట్లో పెనువిషాదం చోటుచేసుకుంది. గుండెపోటుతో కొడుకు మృతిచెందాడు. 2004లో తారకరత్న సినిమా ‘భద్రాద్రి రాముడు’లో కనిపించారామె. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. వాణిశ్రీకి కుమార్తె అనుపమ, కుమారుడు అభినయ వెంకటేష్ ఇద్దరు పిల్లలు. వెంకటేష్ చెన్నైలోని అన్నపూర్ణ మెడికల్ కాలేజీలో తన స్టడీస్ పూర్తిచేసి ప్రస్తుతం ఊటీలో డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాడు.
వెంకటేష్ భార్య కూడా వైద్య వృత్తిలోనే ఉన్నారు. సొంత పని మీద చెన్నై దగ్గరలో చెంగల్పట్టు వెళ్లిన వెంకటేష్ కు అక్కడే గుండెపోటు వచ్చింది. ఎలాంటి ఆరోగ్య సమస్య లేని వెంకటేష్ ఉదయం ఆయన బెడ్‌పై కదలిక లేకుండా ఉండడం గమనించి కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. అయితే వెంకటేష్ కు గతరాత్రి గుండెనొప్పితో నిద్రలోనే తుదిశ్వాస విడిచారని వైద్యులు నిర్ణయించారు. ఒక్కగానొక్క కుమారుడు చనిపోవడంతో వాణిశ్రీ శోకసంద్రంలో మునిగిపోయారు. చిత్రప్రముఖులు వారి కుటుంబానికి సంతాపం తెలిపారు.