Breaking News

వరద ప్రాంతాల్లో మంత్రి పర్యటన

వరద ప్రాంతాల్లో మంత్రి పర్యటన

సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లాలో వరుసగా కురుస్తున్న భారీవర్షాలకు మునిగిపోయిన లోతట్టు ప్రాంతాల్లో రాష్ట్ర గిరిజన, స్త్రీ,శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బుధవారం పర్యటించారు. ఏటూరు నాగారంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లోకి వెళ్లి బాధితులతో స్వయంగా మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఓ మహిళ తన కొడుకు పక్షవాతంతో దవాఖానలో చేరాడని, వైద్యానికి డబ్బులు లేవనడంతో వెంటనే అతడికి మంచి వైద్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా తన వ్యక్తిగతంగా రూ.10వేలు అందజేశారు. అనంతరం ఐటీడీఏ సమావేశంలో పాల్గొన్నారు. వర్షాలు కురుస్తుండడంతో ప్రాణనష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. అనంతరం తాడ్వాయి ప్రభుత్వ దవాఖానలో అందుతున్న వైద్యసేవలు పర్యవేక్షించారు. మేడారం సమ్మక్క సారక్క తల్లులను దర్శించుకున్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. మంత్రి వెంట ములుగు జిల్లా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, స్థానిక ఎమ్మెల్యే సీతక్క, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీవో, ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్, ఏఎస్పీ సాయిచైతన్య, శరత్ చంద్ర పవార్ ఉన్నారు.