ముంబై: ఉమ్మిపై నిషేధం విధించడం వన్డే, టీ20ల వరకైతే ఓకే గానీ, టెస్టులకు మాత్రం ఇబ్బందేనని టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ అన్నాడు. ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల బౌలర్లకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయన్నాడు. ‘ఉమ్మి నిషేధం బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా మారింది. బ్యాట్, బంతికి మధ్య పోటీ సమతూకంగా ఉండాలి. కానీ ఇప్పుడు అలా ఉండకపోవచ్చు.
బంతిని మెరుగుపర్చకపోతే స్వింగ్ కాదు. బాల్ స్వింగ్ కాకపోతే బ్యాట్స్‌మెన్ వేగంగా పరుగులు సాధిస్తారు. దీనివల్ల మ్యాచ్‌లో పోటీతత్వం పోతుంది. కొత్త బంతికి చెమట రాస్తే సరిపోతుంది. కానీ పాత బంతితో రివర్స్ స్వింగ్ రాబట్టాలంటే ఉమ్మి వాడాల్సిందే’ అని ఇషాంత్ వ్యాఖ్యానించాడు. ఉమ్మికి బదులుగా మరో పదార్థాన్ని అందుబాటులో తీసుకురావాలని ఐసీసీకి విజ్ఞప్తి చేశాడు.