పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ కరోనాతో వాయిదాపడింది. ఈ సినిమాలో పవన్‌తో జోడీ కట్టేందుకు ఇంకా ఎవరినీ అధికారికంగా నిర్ణయించలేదు. తమిళంలో అజిత్‌తో వచ్చిన ‘నేర్కొండ పార్వై’ చిత్రంలో అజిత్ సరసన విద్యాబాలన్ నటించారు. అయితే పవన్ పక్కన శృతిహాసన్ ను సెలెక్ట్ చేశారన్న వార్త కొద్దిరోజులుగా చక్కర్లు కొట్టింది. అప్పుడా వార్తలను శృతిహాసన్ కొట్టి పారేసింది. ఇప్పుడేమో ఒక ఎంటర్టైన్మెంట్ పోర్టల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ చిత్రంలో ఓ కీలకపాత్ర చేస్తున్నానంటూ చెప్పింది. వివరాలు అడిగేసరికి మాట తిరగేస్తూ సైలెంట్ అయిపోయింది. లోగుట్టు పెరుమాళ్లకెరుక అన్నట్లుగా వ్యవరిస్తోంది. కాగా, శృతిహాసన్ ‘గబ్బర్ సింగ్, కాటమరాయుడు’ సినిమాల్లో పవన్‌కు జోడీగా నటించింది. వకీల్‌సాబ్ చిత్రాన్ని వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తుండగా, దిల్ రాజు నిర్మిస్తున్నాడు. థమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.
- July 20, 2020
- Archive
- Top News
- సినిమా
- PAVANKALYAN
- SHRUTI HAASAN
- VAKEELSAB
- పవన్‌కల్యాణ్
- వకీల్‌సాబ్
- శృతిహాసన్
- Comments Off on ‘వకీల్ సాబ్’తో శృతిహాసన్ జోడి