Breaking News

లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండండి

లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండండి

సారథి న్యూస్​, కర్నూలు: వచ్చే మూడు రోజుల వరకు భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని నంద్యాల ఏరియాలోని లోతట్టు ప్రాంత కాలనీవాసులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ సూచించారు. నంద్యాల వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. నంద్యాల డివిజన్ లో మహానంది, నంద్యాల టౌన్, రూరల్, బండి ఆత్మకూరు, మంత్రాలయం తదితర మండలాల్లో ఎక్కువ వర్షం కురవడంతో కుందూనది, శ్యాం కాల్వ తదితర వాగులన్నీ ఉధృతంగా ప్రవహించాయని అన్నారు. వరద ప్రాంతాల్లో ప్రభుత్వపరంగా అన్ని సహాయక చర్యలను కూడా చేపడతామన్నారు. వరద బాధితులకు సురక్షిత ఆహారం, నీరు సరఫరా, మెడికల్ క్యాంపులను సమస్య లేకుండా అన్ని వసతులు కల్పిస్తున్నామని చెప్పారు.