న్యూఢిల్లీ: రోజు రోజుకు కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో లాక్‌డౌన్ ను పొడిగిస్తారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు క్లారిటీ ఇచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో జూన్ 15 నుంచి జులై 31 వరకు లాక్‌డౌన్ విధిస్తారని ట్విట్టర్‌లో ట్రెండింగ్ అయినందన ఢిల్లీ హెల్త్ మినిస్టర్ సత్యేంద్ర జైన్ దానిపై క్లారిటీ ఇచ్చారు. ‘లాక్‌డౌన్ ఎక్స్‌టెండ్ చేయం, రూమర్స్ నమొద్దు’ అని ఆయన స్టేట్‌మెంట్ ఇచ్చారు. కాగా.. తమిళనాడు, మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిపై క్లారిటీ ఇచ్చాయి. లాక్‌డౌన్ ఎక్స్‌టెన్షన్ చేసే ఆలోచన లేదని ప్రకటించాయి. ‘లాక్‌డౌన్‌ను ప్రకటించలేదు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, గవర్నమెంట్ రూల్స్ పాస్ చేయాలని సీఎం ఉద్ధవ్ థాక్రే విజ్ఞప్తిచేశారు. జాగ్రత్తగా ఉండాలని చెప్పారు’ అని మహారాష్ట్ర సీఎంవో ట్వీట్ చేసింది.
మహారాష్ట్రలో లాక్‌డౌన్ ఎక్స్‌టెండ్ చేసే విధంగా ఉద్ధవ్ థాక్రే సూచనలు ఇచ్చారని కొన్ని వార్తలు రావడంతో ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు. దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్యలో మన దేశం నాలుగో స్థానానికి చేరింది. మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదు కాగా.. తర్వాతి స్థానంలో తమిళనాడు, ఢిల్లీ ఉన్నాయి.