తెలుగు.. తమిళం.. హిందీ.. బెంగాలీ.. మరాఠీ.. ఇంగ్లిష్ భాషల్లో నటించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది మరాఠీ ముద్దుగుమ్మ రాధికా ఆప్టే. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మొదటి ఎంట్రీ ఇచ్చింది. బోల్డ్ మాటలు.. ముక్కుసూటిగా మాట్లాడే తత్వంతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ బ్యూటీ తెలుగు లెజెండ్, లయన్ చిత్రాల్లో బాలయ్య బాబుతో, ‘కబాలి’లో సూపర్ స్టార్ రజినీకి జోడీగా నటించిన రాధిక కొన్ని వెబ్ సిరీస్ ల్లో కూడా నటించింది. తర్వాత లండన్ వ్యక్తిని పెళ్లాడి లండన్లోనే కాపురం పెట్టింది. అయితే ఈ లాక్ డౌన్ సమయంలో రాధిక అక్కడే లాక్ పోయిందట. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రతి విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకునే రాధిక లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నప్పుడు అక్కడి ప్రజలు ఆమెను బాగా గుర్తుపడుతున్నారని చెప్పింది.
‘లాక్‌డౌన్ కారణంగా, ప్రజలు వెబ్ షోలు బాగా చూస్తున్నారు. ఇప్పుడు నా కోసం లండన్ వీధుల్లో ప్రజలు ఎప్పుడు బయటకు వస్తానా అని ఎదురుచూస్తూ నన్ను కలిసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కొందరు నా దగ్గరకు వచ్చి మీ యాక్టింగ్ బాగుందని ప్రశంసిస్తే చాలా ఆనందంగా ఉంటుంది. నేను లండన్ లో ఈ రకమైన అనుభవాన్ని ఎప్పుడూ పొందలేదు. కానీ స్ర్కీన్ నేమ్ తో నన్ను పిలవడమే నాకు నచ్చడం లేదు’ అని తన లండన్ అనుభవాలను అభిమానులతో ట్విట్టర్లో షేర్ చేసుకుంది రాధిక.